: ఇంటి నుంచి బయలుదేరిన పూరీ జగన్నాథ్!
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు, డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న పూరీ జగన్నాథ్, కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుంచి, 'ఏపీ 09 బీటీ 6363' వాహనంలో బయలుదేరాడు. ముందుగా తన న్యాయవాది దగ్గరకు వెళ్లి, అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి ఆయన వెళతారని తెలుస్తోంది. కాగా, విచారణకు అన్ని ఏర్పాట్లూ చేసిన సిట్ అధికారులు, పూరీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విచారణలో డ్రగ్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? కొకైన్ కోసం ఎవరిని ఆశ్రయించారు? కెల్విన్ ఎలా పరిచయం? అతని దగ్గరకు స్వయంగా వెళ్లారా? కెల్విన్ ఎవరి ద్వారా మీకందించేవాడు?
రోజూ ఎంత మోతాదులో మీరు డ్రగ్స్ తీసుకుంటారు? మాదకద్రవ్యాల కోసం నెలకు మీరు చేసే ఖర్చు ఎంత? కెల్విన్ కన్నా ముందు డ్రగ్స్ అందించిన వారు ఎవరు? నైజీరియన్ వాసి జీఫాన్ తో మీకున్న సంబంధాలు ఎటువంటివి? మీరు డబ్బులు తీసుకుని వేరేవాళ్లకు డ్రగ్స్ ఇస్తున్నారా? ఫ్రెండ్లీగా ఇస్తున్నారా? ముమైత్ ఖాన్, సుబ్బరాజు, చార్మీలకు మీ నుంచే డ్రగ్స్ వెళుతున్న విషయం నిజం కాదా? ఇంకా ఎవరెవరికి మీరు డ్రగ్స్ అందించారు? డ్రగ్స్ తో వచ్చే ఆ కిక్ ఎలా వుంటుంది? మా దగ్గరున్న సాక్ష్యాలకు మీ సమాధానం ఏంటి? ఎన్ని రోజులుగా డ్రగ్స్ వాడుతున్నారు? కొకైన్ వాడుతున్న విషయం నిజం కాదా? తప్పని తెలియదా? వంటి ప్రశ్నలను కూడా ఆయన ఎదుర్కోనున్నాడు.