: పూర్ణిమపై బుల్లితెర నటి సురభి ప్రభావం... తరచూ చాటింగ్!
సినిమాల్లో నటించాలనే కోరికతో 40 రోజుల క్రితం ముంబైకి వెళ్లిపోయిన పూర్ణిమ సాయి (15) మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడకు వచ్చాక కూడా తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ఆమె ససేమిరా అనడంతో మరో మార్గం లేక పోలీసులు ఆమెను నేరుగా బాలికా సదన్‌కు తరలించారు.
కాగా, పూర్ణిమ ముంబై పయనం వెనక రోజుకో విషయం బయటపడుతోంది. ఆమెపై ముంబైకి చెందిన బుల్లితెర నటి సురభి చందన ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా పూర్ణిమ ఆమెతో పలుమార్లు చాటింగ్ చేసినట్టు బయటపడింది. ‘అయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ’, ‘ఐ లవ్ యువర్ యాక్టింగ్’ అంటూ పూర్ణిమ ఆమెతో చాటింగ్ చేసేది. సురభి 'థ్యాంక్యూ' అంటూ రిప్లై కూడా ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సురభి ప్రస్తుతం స్టార్‌ప్లస్‌లో వస్తున్న ‘ఇష్క్‌బాజ్’ షోలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందులో ఆమె పేరు అనిక. అందుకే, ముంబై వెళ్లిన పూర్ణిమ ఆ పేరునే పెట్టుకుని అనికాశ్రీగా మారింది.