: ఏపీని క్రీడల హబ్ గా మారుస్తాం..మినీ స్టేడియాలు నిర్మిస్తాం: ఏపీ మంత్రులు
ఏపీని క్రీడల హబ్ గా మారుస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. 57వ అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవం గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే వారికి అదనపు మార్కులు ఉంటాయని చెప్పారు.
కాగా, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఏపీని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తామని, రాష్ట్రంలో 3 వేల ఆట స్థలాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది జాతీయక్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు.