: అస్సామీ, హిందీ సినీ యువనటి, గాయని బిదిశ అనుమానాస్పద మృతి


అస్సామీ, హిందీ భాషల సినిమాల్లో నటి, గాయనిగా రాణిస్తోన్న బిదిశా బెజ్బరువా అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఈ రోజు ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరివేసుకుని మృతి చెందిన‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డకు చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు. ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సినీ రంగంలో ఆమె అద్భుతంగా రాణిస్తోన్న స‌మ‌యంలో బిదిశా ఇటువంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌బోద‌ని అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఆమెకు గ‌త ఏడాది గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝాతో పెళ్లి జ‌రిగింది. నిశీత్‌ కుటుంబీకులు స‌ద‌రు న‌టిని వేధింపులకు గురిచేయడంతో ఆమె వేరుగా ఉంటోంది. భర్తతో మాత్రం ఆమె సత్సంబంధాలు కొన‌సాగిస్తోంది. 

  • Loading...

More Telugu News