: బెంగళూరులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్


ఐటీ రాజ‌ధాని బెంగళూరులో డ్ర‌గ్స్ అల‌జ‌డి చెల‌రేగింది. స్థానిక ఎన్‌జీఈఎఫ్‌ లేఔట్‌ సదానందనగర మెయిన్‌రోడ్డు వ‌ద్ద కొంద‌రు నైజీరియ‌న్ల‌ను సీసీబీ పోలీసులు త‌ని‌ఖీ చేయ‌గా వారి వద్ద దాదాపు 8 ల‌క్ష‌ల విలువైన‌ కొకైన్‌ లభించింది. నగరంలోని బయప్పనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నైజీరియాకు చెందిన ఆంటోనిఎగ్వోబా, బ్రిటన్‌ నివాసి ఓవెన్‌పెన్‌హాలిజన్, మోజాంబికాలు డ్ర‌గ్స్‌తో ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిపారు. డ్ర‌గ్స్‌తో పాటు వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ఐపాడ్, రెండు పాస్‌పోర్ట్స్, కారు, బైక్‌ను సీజ్ చేసిన‌ట్లు చెప్పారు. ఈ ముఠా అన్య అనే వ్యక్తి పేరుతో సిమ్‌కార్డు పొంది ఈ దందాకు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు వివ‌రించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న‌వారి గురించి ఆరా తీస్తున్న‌ట్లు చెప్పారు.  

  • Loading...

More Telugu News