: చంద్రబాబు పాలనలో కాపులకు స్వర్ణయుగం: రామానుజయ
చంద్రబాబు పాలన కాపులకు స్వర్ణయుగమని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని కాపులు సిగ్గుపడేలా ముద్రగడ పద్మనాభం తీరు ఉందని, కాపుల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆయన యత్నిస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ లాంటి వ్యక్తులను ప్రతిపక్షం వాడుకుంటోందని, వైఎస్ జగన్ డైరెక్షన్ లోనే ఆయన నడుస్తున్నారని విమర్శించారు. గతంలో సభల పేరుతో రైళ్లు తగులబెట్టిన ముద్రగడపై నిఘా పెట్టామని రామానుజయ అన్నారు.