: స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా ఉపయోగిస్తే జ్ఞానశక్తి తగ్గుదల.. తేల్చి చెప్పిన పరిశోధకులు!


స్మార్ట్‌ఫోన్లను అధికంగా ఉప‌యోగించే వారి జ్ఞానశక్తి తగ్గుతుందని యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌లోని మ్యాక్‌కోంబ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆండ్రియన్ ప‌రిశోధ‌న‌ ద్వారా తేల్చి చెప్పారు. మొత్తం 800 మందిపై జ‌రిపిన ప‌రిశోధ‌న ఫ‌లితంగా ఈ అంశాన్ని క‌నుగొన్న‌ట్లు తెలిపారు. 800 మందిని మూడు గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్ వారి సెల్‌ఫోన్‌ల‌ను వారి ద‌గ్గ‌ర‌గా ఉంచ‌కుండా పక్క రూములో ఉంచారు. రెండో గ్రూపులోని వారి సెల్‌ఫోన్లను టేబుల్‌పైన ఉంచారు. ఇక‌ మూడో గ్రూపులో ఉన్నవారి సెల్‌ఫోన్లను వారి జేబుల్లో లేక‌ బ్యాగుల్లో ఉంచారు.

వారందికీ ఓ కంప్యూట‌ర్‌ పరీక్షను నిర్వహించగా, పక్క రూములో ఫోన్లను భద్రపర్చినవారు టేబుళ్లపై ఫోన్లను పెట్టుకున్న వారికన్నా బాగా ఫలితాలు సాధించారని స‌ద‌రు ప్రొఫెస‌ర్ తెలిపారు. అలాగే టేబుళ్లపై సెల్‌ఫోన్లు పెట్టుకున్న బృందంలోని వారు జేబుల్లో ఫోన్లు పెట్టుకున్నవారికన్నా మంచి ఫ‌లితాలు రాబ‌ట్టార‌ని చెప్పారు. సెల్‌ఫోన్లు ఆఫ్‌లో ఉన్నాయా? లేవా ? అన్న సంబంధం లేకుండా అధికంగా ఫోన్‌ను ఉపయోగించేవారు రాణించ‌లేక‌పోయార‌ని, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నవారే మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్టార‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News