: వాటర్ లీకేజ్ లపై సీబీఐతో విచారణ జరిపించాలి: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల డిమాండ్
ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ లో వాటర్ లీకేజ్ లపై సీబీఐతో విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాత్కాలిక రాజధాని నిర్మాణంలో అవకతవకలకు లీకేజ్ లే నిదర్శనమని, ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. కాగా, భారీ వర్షాలకు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలోని మంత్రుల చాంబర్లలోకి వర్షపు నీరు చేరింది. అంతేకాకుండా, పలు విభాగాల్లోకి నీరు చేరడంతో ఉద్యోగులకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి.