: ముఖ‌చిత్రం, మాట తీరు ఉన్నాయి... కానీ హంతకుడు ఇంకా దొర‌క‌లేదు!


అమెరికాలోని ఇండియానాలో నాలుగు నెలల క్రితం జ‌రిగిన జంట హ‌త్య‌ల కేసులో నిందితుని ముఖ‌చిత్రాన్ని ఇండియానా పోలీసులు విడుద‌ల చేశారు. దీంతో పాటు హ‌తురాలి ఫోన్లో రికార్డ‌యిన నిందితుని వాయిస్ క్లిప్ కూడా వారు విడుద‌ల చేశారు. గ‌త ఫిబ్ర‌వరిలో ఇండియానాలోని డెల్ఫీ ప్రాంతానికి చెందిన‌ లిబ‌ర్టీ జ‌ర్మ‌న్‌, ఆబిగ‌లీ విలియ‌మ్స్ అనే బాలిక‌లు అక్క‌డి కొండ ప్రాంతాల‌కు హైకింగ్‌కి వెళ్లారు. రెండ్రోజుల త‌ర్వాత విగ‌త‌జీవులుగా క‌నిపించారు.

పోలీసులు లిబ‌ర్టీ ఫోన్లో రికార్డ‌యిన గొంతు ఆధారంగా నిందితుణ్ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ దొర‌క‌లేదు. త‌ర్వాత ఆ కొండ ప్రాంతానికి వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరాలో ఒంట‌రిగా న‌డుస్తూ వెళ్తున్న ఓ వ్య‌క్తి అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో అత‌ని ముఖ‌చిత్రాన్ని గీయించి పోలీసులు విడుద‌ల చేశారు. ముఖ‌చిత్రం విడుద‌ల చేయ‌డం ద్వారా నిందితుడు సుల‌భంగా దొరుకుతాడని పోలీసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News