: డ్రగ్స్ కేసు నుంచి తప్పిస్తామంటూ రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు, మాజీలు... బొక్కలో పడతారని హెచ్చరిస్తున్న సిట్!


డ్రగ్స్ కేసులో ఇరుక్కోబోతున్నవారి వివరాలను సేకరించిన ఎక్సైజ్ శాఖ అధికారులు, గతంలో పని చేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఇప్పుడు సరికొత్త దందాకు తెరతీసినట్టు తెలుస్తోంది. కెల్విన్, అతని మిత్రబృందం సెల్ ఫోన్ల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, జంట నగరాలకు చెందిన 100 మందికి పైగా వీఐపీల పిల్లల జాబితా సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీన్ని ఆసరాగా తీసుకుని, పబ్బులు, పార్టీల్లో నిత్యమూ కనిపించే ప్రముఖుల పిల్లలే టార్గెట్ గా వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్నారు. డ్రగ్స్ కేసులో మీ పిల్లల పేర్లు ఉన్నాయని చెబుతూ, వారిని తొలగిస్తామని బేరాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సిట్ జాబితా నుంచి తొలగించేందుకు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, దళారులను ఆశ్రయించవద్దని హెచ్చరిస్తున్నారు. వారిని నమ్మితే బొక్క బోర్లా పడతారని, ఈ కేసులో ప్రమేయముంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News