: ఇకపై రాజకీయాలు వద్దు: వెంకయ్యనాయుడికి చంద్రబాబు సలహా
ఎన్నో దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తూ, దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వెంకయ్యనాయుడు, ఇప్పుడిక ఉపరాష్ట్రపతిగా రాజకీయాలకు దూరం కావడం కాస్తంత కష్టమైన పనేనని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన జీవనమంతా రాజకీయాలే కావడంతో, ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకోవడం కష్టమేనని అన్నారు. వెంకయ్య ఇక రాజకీయాలు మాట్లాడకుండా కంట్రోల్ గా ఉండాలని సూచిస్తున్నట్టు తెలిపారు. వెంకయ్యనాయుడికి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చంద్రబాబు, ఆయన రాష్ట్రానికి దూరమవుతారన్న ఆలోచన బాధను కలిగిస్తోందని, ఇదే సమయంలో అభివృద్ధి విషయంలో మాత్రం నష్టం కలుగబోదనే భావిస్తున్నట్టు తెలిపారు. తన ముందున్న పెద్ద పరీక్షలో వెంకయ్యనాయుడు ఉత్తీర్ణుడవుతాడన్న నమ్మకం తనకుందని తెలిపారు.