: అందుకే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు సరైనవారని భావించాం: ప్రధాని మోదీ
ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ఎంపిక చేయడం పట్ల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెంకయ్యకు ఉన్న పార్లమెంటరీ అనుభవం క్రియాశీలకం కానుందని, ప్రజా జీవితంలో ఎంతో అనుభవం గడించిన నేత వెంకయ్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెంకయ్య ఓ రైతు బిడ్డ అని, ఆయనకు ఉన్న సుదీర్ఘ పార్లమెంటు అనుభవంతో రాజ్యసభ ఛైర్మన్ గా కీలక భూమిక పోషిస్తారని, చాలా ఏళ్లుగా వెంకయ్య తనకు తెలుసని మోదీ అన్నారు. కీలకమైన రాజ్యసభలో వెంకయ్య నాయుడి సేవలు అత్యావశ్యకమని పేర్కొన్నారు. వెంకయ్య నిరంతర శ్రమ తనను ఆకట్టుకుందని, అందుకే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు సరైన వారని భావించామని తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు వన్నె తెస్తారని పేర్కొన్నారు.