: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు ఖరారు
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎం. వెంకయ్యనాయుడు పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. కాగా, రేపు ఉదయం 11 గంటలకు వెంకయ్యనాయుడు నామినేషన్ వేయనున్నారు. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.