: కార్పొరేటర్ మురళీ హత్య కేసులో మా నేతను అక్రమంగా ఇరికించారు: జానారెడ్డి


వరంగల్ కార్పొరేటర్ మురళి హత్య కేసులో తమ నేత నాయిని రాజేందర్ రెడ్డిని అక్రమంగా ఇరికించారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, ఈ హత్యతో రాజేందర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, నిందితులు ఆయన పేరు చెప్పలేదని అన్నారు. రాజకీయ కక్షలకు పాల్పడటం సబబుకాదని ఆయన హితవు పలికారు.1972లో తనను కూడా ఇలాగే ఓ కేసులో అక్రమంగా ఇరికించారని, అయితే, తనపై అక్రమంగా కేసు పెట్టారని కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. మరో నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని, పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News