: న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చేస్తున్నా: కోహ్లీ
వెస్టిండీస్ పర్యటన అనంతరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తోన్న విషయం తెలిసిందే. తన టూర్‌ను ముగించుకున్న కోహ్లీ భారత్‌కి బయలుదేరినట్లు ఆయన చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రముఖ ప్రదర్శనశాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించినప్పటి ఫొటోలను తన అభిమానులతో పంచుకున్నాడు. ఓ కారులో కూర్చుని తీసుకున్న సెల్ఫీని కూడా పోస్ట్ చేస్తూ ‘తిరిగి యథాస్థితికి’ అని పేర్కొన్నాడు. కొన్ని రోజుల్లో టీమిండియా... శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే.