: అప్పుడు, డ్రగ్స్ తీసుకున్నా: బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్
పాఠశాలకు వెళ్లే రోజుల్లోనే తనకు డ్రగ్స్ అలవాటు ఉండేదని, ఆ తర్వాత పూర్తిగా మానేశానంటూ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఓ సినిమాలో సన్నివేశం నిమిత్తం తక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. 2011లో విడుదలైన ‘రాక్ స్టార్’ చిత్రంలో తాను హీరోగా నటించానని, ఈ చిత్రంలో ఓ సన్నివేశం వాస్తవంగా ఉండాలని భావించి డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. ఈ చిత్రంలో స్టేజ్ పై ప్రదర్శన ఇచ్చే సన్నివేశంలో తాగినవాడిగా కనిపిస్తానని, అందుకని, డ్రగ్స్ తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.