: గ్రామ‌స్తులంతా క‌లిసి అడ్డుకున్నా... కోదండ‌రామ్‌ను అరెస్టు చేసిన పోలీసులు


టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రామ్‌ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఆయన సిద్ధిపేట జిల్లా మర్కూక్‌ మండలంలో ప‌ర్య‌టించారు. ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న కొండపోచమ్మ జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు కోదండ‌రామ్‌తో తమ బాధ‌లు చెప్పుకున్నారు. రైతుల‌తో చ‌ర్చించిన అనంత‌రం బైలంపూర్‌లో బాధిత రైతులను పరామర్శించే క్రమంలో ఓ రైతు ఇంట్లోకి ఆయ‌న వెళ్లారు. దీంతో కోదండరామ్‌ను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అయితే, కోదండ‌రామ్‌ను అరెస్టు చేయ‌కూడ‌ద‌ని గ్రామ‌స్తులు అడ్డుప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ వారంద‌రినీ చెద‌ర‌గొట్టిన పోలీసులు కోదండ‌రామ్‌ను అక్క‌డి నుంచి తీసుకెళ్లారు. 

  • Loading...

More Telugu News