: ఇలాంటి చీర కట్టుకుని వస్తే.. కుర్రాళ్ల పరిస్థితి ఏంటి?: ఉదయభానుపై రామ్- లక్ష్మణ్ ల చిలిపి వ్యాఖ్య


చాలా గ్యాప్ తర్వాత మళ్లీ యాంకరింగ్ మొదలు పెట్టిన ఉదయభాను తనదైన శైలిలో దూసుకుపోతోంది. తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన 'గౌతమ్ నందా' ఆడియో ఫంక్షన్ లో ఉదయభాను తళుక్కున మెరిసింది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్లు రామ్ లక్షణ్ లను వేదికపైకి ఆహ్వానించిన భాను... వారిద్దరి గురించి కాస్త ఎక్కువగానే చెప్పింది.

స్టేజి పైకి వచ్చిన రామ్ లక్ష్మణ్ లు మైక్ అందుకుని, తమ గురించి ఉదయభాను చెప్పిందంతా నిజం కాదని... ఏదో అభిమానం కొద్దీ తమ గురించి అలా చెప్పిందని అన్నారు. పెద్ద పొగడ్తలకు తాము అర్హులం కామని వినమ్రంగా తెలిపారు. ఇదే సందర్భంగా ఉదయభానుపై చిలిపిగా కామెంట్ చేశారు. 'నువ్వు వస్తేనే చాలా బ్రైట్... మరి, ఇలాంటి బ్రైట్ చీర కట్టుకుని వస్తే, కుర్రాళ్ల పరిస్థితి ఏంటని' సరదాగా అన్నారు. దీంతో, ఉదయభాను కాస్త సిగ్గు పడింది. తమ ఫేవరెట్ హీరోయిన్ ఉదయభానే అని... తాము హీరోలుగా నటించిన 'ఖైదీ బ్రదర్స్' సినిమాలో భాను హీరోయిన్ గా నటించిందని చెప్పారు. ఆ అభిమానంతోనే తమను కొంచె ఎక్కువగా పొగిడిందని అన్నారు.  

  • Loading...

More Telugu News