: ఏఆర్ రెహ‌మాన్ సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై `వ‌న్ హార్ట్‌`... ట్రైల‌ర్ విడుద‌ల‌


ఆస్కార్‌, గ్రామీ అవార్డుల విజేత ఏఆర్ రెహ‌మాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌ల నేప‌థ్యంలో చిత్రీక‌రించిన `వ‌న్ హార్ట్‌` వీడియో ట్రైల‌ర్ విడుద‌లైంది. సంగీత ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాలంటే ఎలాంటి క‌స‌ర‌త్తులు చేయాలి? అభిమానుల‌ను నిరుత్సాహ ప‌ర‌చ‌కుండా ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఇవ్వాలి? ప్ర‌ద‌ర్శ‌నకు తెర వెన‌క ఏం జ‌రుగుతుంది? వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌తో దీనిని తెర‌కెక్కించారు. ఏఆర్ రెహ‌మాన్ ప్ర‌ద‌ర్శ‌న‌లు విజ‌య‌వంతం కావ‌డానికి స‌హాయ‌ప‌డిన జోనితా గాంధీ, హ‌రిచ‌ర‌ణ్ వంటి గాయ‌కుల మాట‌లు, ఇత‌ర సాంకేతిక సిబ్బంది వివ‌ర‌ణ‌లు ఇందులో చూపించ‌నున్నారు. ఇదిలా ఉంచితే, ఇటీవ‌ల లండ‌న్‌లోని వెంబ్లి స్టేడియంలో జ‌రిగిన సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏఆర్ రెహ‌మాన్ త‌మిళ పాటలు ఎక్కువ‌గా పాడార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే!

  • Loading...

More Telugu News