: నాని నిజంగానే ఫుల్ బాటిల్ మందు తాగి షూటింగ్ చేశాడు!: కోన వెంకట్
'నిన్ను కోరి' సినిమా సూపర్ హిట్ కావడానికి ప్రేక్షకులే కారణమని స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ కోన వెంకట్ అన్నారు. ఈ సినిమాలో నాని, ఆది, నివేదితలు అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డాడని తెలిపారు. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం నాని ఫుల్ బాటిల్ మందు తాగేశాడని చెప్పారు. అమెరికాలో సున్నా డిగ్రీల టెంపరేచర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు, ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు... ఆ సీన్ ను పండించడానికి నాని నిజంగానే మందు తాగాడని... ఆ సీన్ ఎంతో నేచురల్ గా వచ్చిందని కొనియాడారు. నాని నేచురల్ స్టార్ అని చెప్పడానికి ఇదో నిదర్శనమని చెప్పారు. విజయవాడలో 'నిన్ను కోరి' సక్సెస్ మీట్ లో కోన వెంకట్ మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.