: 'బిగ్ బాస్' కోసం కొడుకుని హాస్టల్ లో చేర్చిన జ్యోతి!
ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూసిన 'బిగ్ బాస్' రియాల్టీ షో నిన్న రాత్రి ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది పార్టిసిపెంట్స్ ను జూనియర్ ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి ఫీలింగ్స్ తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పి లోపలకు పంపాడు. ఈ సందర్భంగా ఏడో పార్టిసిపెంట్ గా వచ్చిన నటి జ్యోతి ఓ ఆసక్తికరమైన విషయం తెలిపింది.
ఈ షో కోసం తన కొడుకుని హాస్టల్ లో జాయిన్ చేసి వచ్చానని చెప్పింది. సినిమాల్లో తాను వేసిన క్యారెక్టర్లను చూసి, తనను ఐటెం గాళ్ గా భావిస్తున్నారని... ఐతే తానేంటో ఈ షో ద్వారా చూపిస్తానని చెప్పింది. తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... తాను ఒక మంచి 'అమ్మ'ను అని తెలిపింది. ఈ షోలో జ్యోతితో పాటు అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, మధుప్రియ, ప్రిన్స్, కల్పన, సంపూర్ణేష్ బాబు, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివబాలాజీ, ఆదర్శ్, నటి హరితేజ, ధన్ రాజ్ లు పాల్గొంటున్నారు.