: ఓటు హక్కును వినియోగించుకున్న కేసీఆర్
దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఓటును వేశారు. అనంతరం స్పీకర్ మధుసూదనాచారి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, కోమటిరెడ్డి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ శాసనసభ కమిటీ హాలులో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ లోనికి ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు, పెన్నులను అధికారులు అనుమతించలేదు. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.