: రాష్ట్రపతి ఎన్నికల వేళ ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్!
భారత రాష్ట్రపతి ఎన్నిక వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. సమయపాలన పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే ఎలాగని మండిపడ్డారు. ఓటు వేయడానికి ఇంకా రాని ఎమ్మెల్యేలకు వెంటనే ఫోన్ చేయాలని టీడీఎల్పీని ఆదేశించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల లెక్క చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా మిస్ కాకూడదంటూ ఆదేశించారు. మరోవైపు, మాక్ పోలింగ్ లో పొరపాటు చేసిన ఎమ్మెల్యేలను మరోసారి లోపలకు పంపిస్తున్నారు చంద్రబాబు.