: కేసీఆర్ కు రక్తంతో లేఖ రాసిన వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు
తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖను వస్తు సేవల పన్నుకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేస్తూ, వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం ప్రెసిడెంట్ మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రక్తంతో లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఈ లేఖను ఆయన పత్రికలకు విడుదల చేశారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ విధానాన్ని స్వాగతిస్తూనే, రాష్ట్రానికి చెందిన పన్నుల శాఖ కూడా రీ ఆర్గనైజేషన్ కావాలని కోరారు. దీనికి అనుగుణంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పన్నుల శాఖను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.