: నేను చాలా చిన్నోడిని... అసలు కొకైన్ బ్యాచ్ వేరే ఉంది... అందరూ వీఐపీలే!: సబర్వాల్ కు చెప్పిన కెల్విన్


తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న మత్తుమందుల బాగోతంలో ప్రధాన నేరస్తుడు కెల్విన్ మరిన్ని కీలకాంశాలను విచారణలో వెల్లడించాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పుతూ, సిట్ అధికారులు కేవలం ఎల్ఎస్డీని విక్రయిస్తున్న ముఠానే పట్టుకున్నారని, అసలైన కొకైన్ బ్యాచ్ వేరే ఉందని, ఆ జాబితాలో చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారి పిల్లలు కూడా ఉన్నారని చెప్పినట్టు తెలుస్తోంది. బాలానగర్ లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఈ విచారణ జరుగగా, ఈడీ అకున్ సబర్వాల్ స్వయంగా పాల్గొన్నారు.

అయితే, రహస్య సమాచారాన్ని అత్యధిక శాతం దాటవేసినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. కొకైన్ తీసుకోవడాన్ని ఉన్నత వర్గాల్లో స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారని కెల్విన్ చెప్పుకొచ్చాడు. మరింత సమాచారం జీషన్ వద్ద ఉంటుందని, జీషన్ ను విచారిస్తే ఈ వ్యవహారంలో పెద్దల పేర్లు బయటకు వస్తాయని చెప్పడంతో, గత వారంలో ఓ స్టార్ హోటల్ సమీపంలో అరెస్ట్ అయిన జీషన్ ను కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారాంతాలతో పాటు, వినాయక నిమజ్జనాలు జరిగే చివరి నాలుగు రోజుల్లో ఎల్ఎస్డీ డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని, తాను ప్రతి నెలా గోవాకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటానని కూడా కెల్విన్ వెల్లడించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News