: కోవింద్‌కు మోదీ అడ్వాన్స్ విషెస్.. ప్రభుత్వ మద్దతు ఉంటుందన్న ప్రధాని!
ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికలకు ఒక రోజు ముందే అడ్వాన్స్ విషెస్ చెప్పేశారు. కోవింద్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఆదివారం ఎన్డీఏ ఎంపీలతో నిర్వహించిన సమావేశానికి కోవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కు కోవింద్ ‘సహయోగి’ (సెక్రటరీ)గా పనిచేసిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే రాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్న కోవింద్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహయోగ్ (సహాయం) ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ నాయకుడిగా, లాయర్‌గా కోవింద్ ప్రయాణం వివాద రహితంగానే సాగిందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కూడా అదే బాటలో సాగిందని ప్రధాని పేర్కొన్నారు.