: మాక్ పోలింగ్ కు గైర్హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ మండిపాటు
రాష్ట్రపతి ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు ఎలా వేయాలనే విషయమై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించే నిమిత్తం తెలంగాణ భవన్ లో మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే, మంత్రి లక్ష్మారెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు దీనికి గైర్హాజరయ్యారు. దీంతో, సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రేపు ఉదయం మరోమారు మాక్ పోలింగ్ పై ఎమ్మెల్యేలను సమన్వయం చేసే బాధ్యతను మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. టీఆర్ఎస్ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కొప్పుల ఈశ్వర్, గంప గోవర్ధన్ ను నియమించారు.