: సికింద్రాబాద్-బీహార్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు!


ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ల నుంచి బీహార్ కు 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్టు చెప్పారు.

* సికింద్రాబాద్- దర్బంగ (ట్రెయిన్ నెంబర్ 07007): ఈ నెల 18, 22, 25, 29 తేదీల్లో రాత్రి పది గంటలకు బయలుదేరతాయి. తిరుగు ప్రయాణంలో దర్బంగ నుంచి ఈ నెల 21, 25, 28, ఆగస్టు 1వ తేదీల్లో తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరతాయి.

*  హైదరాబాద్- రాక్షల్ మధ్య (ట్రెయిన్ నెంబర్ 07005) ఈ నెల 20, 27 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు బయలుదేరతాయి. తిరుగుప్రయాణంలో రాక్షల్ నుంచి ఈ నెల 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి.
కాగా, సికింద్రాబాద్-దర్బంగ మధ్య వారానికి రెండు రోజులు నడిచే రైలును, హైదరాబాద్-రాక్షల్ మధ్య వారానికి ఒక రోజు నడిచే రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News