: సీపీఈసీని అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.. పాక్ పెడబొబ్బలు!


50 బిలియన్ డాలర్లతో పాక్‌లో చైనా నిర్మిస్తున్న చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ని అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ పెడబొబ్బలు పెడుతోంది. సీపీఈసీకి అంతరాయం కలిగించే చర్యలు చేపడుతోందని పాక్ అత్యున్నత స్థాయి మిలటరీ అధికారి ఒకరు శనివారం ఆరోపించారు.

సీపీఈసీలో భాగంగా కారిడార్ వెంబడి  రహదారులు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోంది. ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) గుండా సాగుతుండడంతో భారత్ ఇప్పటికే తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు భారత్‌ తన గూఢచార సంస్థ ‘రా’ను రంగంలోకి దింపిందని, దానిని ఎలాగైనా అడ్డుకునే ఉద్దేశంతో వివిధ చర్యలకు పాల్పడుతోందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ జుబేర్ మహమూద్ ఆరోపించారు. అయితే ‘శత్రుదేశ’ వ్యూహాల పట్ల పాక్ అప్రమత్తంగా ఉందని రక్షణ దళాల అత్యున్నత అధికారి అయిన ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, సుస్థిరతలు ఈ ప్రాంత సుస్థిరతకు చాలా అవసరమని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News