: పెను సంచలనం... కెల్విన్ కాల్ లిస్టులో తెలంగాణలో అత్యంత కీలక నేత కొడుకు సెల్ నంబర్!


ప్రస్తుతం కెల్విన్ ను విచారిస్తున్న ప్రత్యేక దర్యాఫ్తు బృందం పోలీసులు, మరో సంచలన విషయాన్ని రాబట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే, ఓ పెద్ద నిర్మాత కొడుకు, ఇటీవల ఓ చిత్రంతో ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ఓ హీరోతో పాటు, మరో నిర్మాత కుమారుడు కూడా ఉన్నాడన్న సంచలన నిజం వెలుగులోకి రాగా, ఇప్పుడు, తెలంగాణలోనే అత్యంత కీలక నేత కొడుకు, ఎన్నో అధికార కార్యక్రమాల్లో అనధికారికంగా ముందుండే ఓ విద్యార్థి కూడా ఉన్నాడన్న వార్త బయట పడటం తీవ్ర సంచలనమైంది. విచారణలో భాగంగా, అతని పేరు, సెల్ నంబర్ రావడంతో పోలీసులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయారని సమాచారం. అతనితోపాటు పలువురు రాజకీయ నేతల పిల్లలను కూడా కెల్విన్ ఉచ్చులోకి లాగినట్టు తెలుస్తోంది.

దీంతో పాటు చిన్న సినిమాల నిర్మాణంతో ప్రస్థానం ప్రారంభించి, భారీ చిత్రాలను తీసి, ఇటీవల ఓ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చి వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి పేరు కూడా వెల్లడైంది. సదరు దర్శకుడు ఇప్పటికే ఈ జాబితాలో చేరిపోవడం గమనార్హం. తాను బయటపడితే కేసు పెద్దది కాకుండా చూసుకునేందుకే పలువురు రాజకీయ నాయకుల పిల్లలను కెల్విన్ టార్గెట్ చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కాగా, వారి పేర్లన్నింటినీ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. విచారణలో పేరు చెబితే, చట్టపరంగా కేసులో జోడించలేమని, సాక్ష్యాలు ఉంటేనే వారిని విచారించేందుకు వీలవుతుందని పోలీసు వర్గాలు చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News