: అమెరికా సూపర్‌పవర్ స్థానం కోల్పోయే సమయం ఎంతో దూరంలో లేదు: హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్


హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గ్రాహమ్ ఎల్లిసన్ తన ‘డిస్టెండ్ ఫర్ వార్’ పుస్తకంలో అమెరికాకు సంబంధించి పలు ఆస‌క్తిక‌ర‌మైన‌ విషయాలు తెలిపారు. అగ్ర‌రాజ్యంగా ఉన్న‌ అమెరికాను తలదన్నే శక్తులుగా ప‌లు దేశాలు త‌యార‌వుతున్నాయ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన సైనిక వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉన్న అమెరికా ప్రస్తుతం ఏ దేశంపై అయినా యుద్ధం చేస్తే మాత్రం ఎంతో న‌ష్ట‌పోతుంద‌ని హెచ్చ‌రించారు. త్వరలోనే ఆ దేశం సూపర్‌పవర్ స్థానం కోల్పోతుందని త‌న పుస్త‌కంలో పేర్కొన్నారు.
 
ఉత్తరకొరియా ఒకవైపు అమెరికాను భయపెట్టడం మొదలుపెట్టిందని గుర్తు చేసిన ఆయ‌న‌.. ఈ విష‌యంతోనే అమెరికా పతనం మొదలైందని భావించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఉత్త‌ర‌కొరియాకు తోడుగా చైనా కూడా అమెరికాకు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తే ఇక అమెరికా పని అయిపోతుంద‌ని అన్నారు. అంతేగాక‌, చైనా ఆర్థికంగా బలపడితే జరిగే అనర్థాలను ఊహించుకోలేమ‌ని కూడా పేర్కొన్నారు. అమెరికాకు వ్య‌తిరేకంగా ఉత్తరకొరియా, చైనాలు చేతులు కలిపేందుకు కూడా వెనుకాడబోవని పేర్కొన్నారు.

త‌మ చుట్టూ ఉన్న దేశాల‌కు, చైనాకు మ‌ధ్య స‌త్సంబంధాలు లేక‌పోవ‌డం అమెరికాకు క‌లిసి వ‌చ్చే అంశమ‌ని చెప్పారు. అమెరికా త‌న అగ్ర‌రాజ్యం హోదాని కోల్పోయే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. మ‌రోవైపు  భారత్ కూడా ప్రపంచఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న స‌మయంలోనూ తట్టుకుని నిలబడగ‌లుగుతోంద‌ని అన్నారు. అందులో దేశంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధే కారణమని తెలిపారు.  

  • Loading...

More Telugu News