: ఇంతగా మాట్లాడుతున్న కమలహాసన్ అసలు సక్రమంగా పన్ను కడుతున్నారా?: తమిళనాడు మంత్రి
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ఇటీవల పలు అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వంపై కూడా ఆయన అవినీతి ఆరోపణలు చేశాడు. దీంతో కమల్‌పై విమర్శలు చేస్తోన్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి కమలహాసన్‌పై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. అసలు కమల్ సినిమాల నుంచి సంపాదిస్తున్న దానికి సక్రమంగా పన్ను కడుతున్నారా? అని ఆయన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఆడిట్ నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే తమ సర్కారుపై కమల్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.