: డ్రగ్స్ కేసు: కెల్విన్ ను కస్టడీలోకి తీసుకుని.. మరిన్ని విషయాలు రాబడుతున్న పోలీసులు
డ్రగ్స్ సరఫరా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ను రెండు రోజుల కస్టడీకి తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయనను చంచల్ గూడ జైలు నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ఆయనను తీసుకొచ్చిన తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయనను ప్రశ్నిస్తోంది. వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ ముఠా ఎవరెవరితో సంప్రదింపులు జరిపిందనే అంశం సహా ఈ కేసులోని పలు అంశాల్లో పూర్తిస్థాయిలో అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ ముఠాతో ఎక్కడెక్కడ ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని రాబట్టనున్నారు. వారు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారనే విషయాన్ని తెలుసుకుంటారు.