: ఎన్టీఆర్ డ్యాన్స్ తో 'బిగ్ బాస్' షో ఆరంభం?
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో రేపటి నుంచి ప్రారంభంకానుంది. పూణేలో వేసిన భారీ సెట్టింగ్ లో ఈ షో జరుగుతోంది. మొత్తం 12 మంది సెలబ్రిటీలు 70 రోజుల పాటు ఒక బిగ్ హౌస్ లో గడపనున్నారు. మొత్తం 60 కెమెరాలు వీరిని గమనించనున్నాయి. అభిమానులంతా ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఈ షో ప్రారంభం ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి పలువురిలో నెలకొంది. అయితే ఈ షో ఎన్టీఆర్ డాన్స్ పర్ఫామెన్స్ తో ప్రారంభమవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీని కోసం ఎన్టీఆర్ డాన్స్ రిహార్సల్స్ కూడా చేశాడట.