: భయపెట్టేందుకు వచ్చేస్తోన్న 'ఆనందో బ్రహ్మ' ట్రైలర్!


తెలుగు తెరపైకి కామెడీతో కూడిన హారర్ థ్రిల్లర్ చిత్రాలు చాలానే వచ్చాయి. కరెక్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ తరహా సినిమాలు చాలావరకూ సక్సెస్ ను సాధించాయి. అందువల్లనే 'ఆనందో బ్రహ్మ' అంటూనే భయపెట్టడానికి మరో హారర్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. తాప్సి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, వెన్నెల కిషోర్  .. శ్రీనివాస రెడ్డి . . షకలక శంకర్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

 ఇటీవల వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో .. ఈ నెల 19వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా దర్శకుడు మహి వి.రాఘవ్ ట్రైలర్ ను కట్ చేస్తున్నాడు. ఆగస్టు 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి .  

  • Loading...

More Telugu News