: రాఘవేంద్రరావుజీ! సారీ, నన్ను క్షమించండి..!: తాప్సీ


ఓ కామెడీ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భాగంగా త‌నను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుపై తాప్సీ చేసిన కామెంట్ల‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో త‌న‌ మాట‌ల‌ను స‌మ‌ర్థించుకున్న తాప్సీ, నిన్న రాత్రి సోష‌ల్‌మీడియాలో వీడియో పోస్ట్ చేసి రాఘ‌వేంద్ర‌రావును క్ష‌మించ‌మ‌ని అడిగింది.

`ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మాట‌లు మ‌న‌స్ఫూర్తిగా చెప్పిన‌వి కావు.. వాటిని అర్థం చేసుకోలేక త‌ప్పుదోవ ప‌ట్టించారు. ఏదేమైనా క్షమించ‌మ‌ని అడుగుతున్నాను` అని ఆమె పోస్ట్ చేసింది. ఇక వీడియోలో ఆమె మాట్లాడుతూ - `నాపై నేను జోకులు వేసుకుంటున్నా అనుకున్నాగానీ, అవి ఇంత గొడ‌వ‌కు దారితీస్తాయ‌నుకోలేదు. రాఘ‌వేంద్ర‌రావుగారు నాకు సినీ జీవితాన్ని ఇచ్చారు. ఆయ‌న గురించి నేను త‌ప్పుగా ఎలా మాట్లాడ‌తాను` అంది. త్వ‌ర‌లో తాప్సీ న‌టించిన `ఆనందో బ్ర‌హ్మ‌` సినిమా విడుద‌ల‌కానుంది. తాప్సీ మాట‌ల ప్ర‌భావం ఈ సినిమాపై ప‌డుతుంద‌న్న భ‌యంతో నిర్మాత‌లు ఆందోళ‌న చెందారు. ఇప్పుడు త‌ను క్ష‌మాప‌ణ‌లు చెప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News