: డ్రగ్స్ డీలర్ కెల్విన్ ను కస్టడీలోకి తీసుకున్న సిట్.. సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం!
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, జాతీయ స్థాయిలో టాలీవుడ్ డ్రగ్స్ భాగోతం సంచలనం రేపుతోంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరందరినీ వ్యక్తిగతంగా విచారించనుంది సిట్. ఈ నేపథ్యంలో డ్రగ్స్ డీలర్ కెల్విన్ ను ఎక్సైజ్ సిట్ తమ కస్టడీలోకి తీసుకుంది. హైదరాబాదులోని చర్లపల్లి జైల్లో ఉన్న కెల్విన్ ను విచారణ నిమిత్తం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడు. రెండు రోజుల పాటు కెల్విన్ ను అధికారులు విచారించనున్నారు. కెల్విన్ ను విచారించే క్రమంలో టాలీవుడ్ లో డగ్స్ వినియోగంపై సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.