: కన్నడ నటి రమ్య రహస్య వివాహం!


ప్రముఖ కన్నడ నటి రమ్య బార్నా రహస్యంగా వివాహం చేసుకుందన్న వార్తలు శాండల్ వుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా రావడంతో... సర్వత్ర ఇదే చర్చ జరుగుతోంది. పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రమ్య... గత కొంత కాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటోంది. మే 29న జేడీఎస్ బహిష్కృత ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ బంధువైన వ్యాపారవేత్త ఫహాద్ అలీఖాన్ ను బెంగళూరులోని శివాజీనగర్ లో ఆమె వివాహం చేసుకుంది. స్థానికంగా ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు రహస్య వివాహం చేసుకున్నట్టు కథనాలు ప్రసారమవుతున్నాయి. 

  • Loading...

More Telugu News