: ఈ హెల్మెట్లను తాకాలంటే తూటాలు కూడా భయపడతాయి.. ఇండియన్ ఆర్మీ కోసం ‘బాలిస్టిక్ హెల్మెట్లు’!


ఇండియన్ ఆర్మీ కోసం అత్యాధునిక హెల్మెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. బులెట్లు సైతం వీటిని ఏమీ చేయలేవు. ‘బాలిస్టిక్ బులెట్ ప్రూఫ్ హెల్మెట్లు’గా వ్యవహరించే వాటిని భారత సైన్యం శుక్రవారం ఆవిష్కరించింది. 9ఎంఎం తుపాకితో 20 మీటర్ల సమీపం నుంచి కాల్చినా సైనికులకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. సైనికుల ప్రాణ రక్షణలో ఇవి ఎంతగానో తోడ్పడతాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అత్యంత తేలికగా ఉండే ఈ హెల్మెట్లు బులెట్లకు సైతం ఎదురొడ్డుతాయని పేర్కొన్నాయి.

కాన్పూర్‌కు చెందిన ఎంకేయూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ హెల్మెట్ల తయారీ బాధ్యతను తీసుకుంది. రూ.170 కోట్ల వ్యయంతో 1.58 లక్షల హెల్మెట్లను ఈ సంస్థ తయారు చేసి ఆర్మీకి అప్పగిస్తుంది. వీటిలో సాధారణ బాలిస్టిక్ హెల్మెట్లు, కమాండ్ బాలిస్టిక్ హెల్మెట్లు అనే రెండు రకాలు ఉన్నాయి. కమాండ్ హెల్మెట్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉంటుంది. మొదటి విడతలో భాగంగా 7500 హెల్మెట్లు అందగా, అందులో 2500 హెల్మెట్లను ఐరాసలో ఉన్న సైనికులకు అందించనున్నారు. మిగతా 5 వేల హెల్మెట్లకు బాలిస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆర్మీ తెలిపింది.

  • Loading...

More Telugu News