: ఫ్లిప్ కార్ట్ లో ఒక్క‌రోజులో ల‌క్ష అమ్ముడైన ‘మోటో ఈ 4’ మోడల్ ఫోన్లు!


ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మ‌కానికి ఉంచిన ‘మోటో ఈ 4’ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు కేవ‌లం 24 గంట‌ల్లోనే లక్ష అమ్ముడుపోయాయి. లెనోవో ఇటీవ‌లే మోటరోలా బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. జులై 12న ‘మోటో ఈ 4’ పేరిట కొత్త మోడ‌ల్‌ను విక్ర‌యానికి ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్లు తొలి గంటలో నిమిషానికి 580 అమ్ముడయ్యాయని కూడా ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో సామ‌ర్థ్యంతో ఈ ఫోన్‌ను రూపొందించారు. దీని ధర రూ.8,999గా ఉంది.
 

 ‘మోటో ఈ 4’ ఫీచ‌ర్లు..
  • 5.5 అంగుళాల స్క్రీన్‌
  • 2.5డి కర్వ్‌డ్‌ గ్లాస్
  • మీడియాటెక్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
  • 3 జీబీ ర్యామ్‌
  • 32జీబీ అంతర్గత మెమొరీ
  • 13 మెగాపిక్సల్‌ కెమెరా
  • ఎల్‌ఈడీ ఫ్లాష్‌
  • 5 ఎంపీ ముందు కెమెరా

  • Loading...

More Telugu News