: రామ్ చరణ్ అభిమాని చిన్నారి పరశురామ్ మృతి!


ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ ఫ్యాన్, చిన్నారి అభిమాని పరశురామ్ మృతి చెందాడు. కామెర్ల వ్యాధితో ఈ రోజు ఆ చిన్నారి మృతి చెందడంతో బాలుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, గద్వాల జిల్లా ఇజా మండలానికి చెందిన బాలుడు పరశురామ్. ‘మెగా’ అభిమాని అయిన పరశురామ్, సుమారు రెండేళ్ల క్రితం రామ్ చరణ్ ని తన కుటుంబసభ్యులతో కలిశాడు. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్ నటించిన చిత్రాలలోని డైలాగ్స్ ను చెర్రీకి వినిపించడటంతో, ఆయన ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేశాడు. ఆ సందర్భంగా 'ఆరెంజ్' చిత్రంలో తను ధరించిన ఓ టీ షర్ట్ ను పరశురామ్ కి కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నాడు మీడియాలో హల్ చల్ చేశాయి.  

  • Loading...

More Telugu News