: ఇంతకంటే అద్భుతమైన జ్ఞాపకం ఏముంటుందీ!: కత్రినా కైఫ్


తాను పద్దెనిమిదేళ్ల వయసులోనే సల్మాన్ ఖాన్ తో కలిసి సినిమాలో నటించానని, ఇంతకంటే, అద్భుతమైన జ్ఞాపకం ఏముంటుందని బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ చెప్పింది. ఈ రోజు నుంచి న్యూయార్క్ లో జరగనున్న ఐఫా-2017 అవార్డ్స్ వేడుక సందర్భంగా కత్రినా మాట్లాడింది. అయితే, ఈ వ్యాఖ్యలకు సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ‘నీకు గుర్తుండిపోయేంత అద్భుతమైన పని నేనేమీ చేయలేదే!’ అన్నాడు సరదాగా. దీంతో ఆహూతులు ఒక్కసారిగా నవ్వులు కురిపించారు.

కాగా, 2003లో ‘బూమ్’ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి కత్రినా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. 2005లో వచ్చిన ‘మై ప్యార్ క్యూ కియా’ చిత్రంలో సల్మాన్ సరసన కత్రినా నటించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. తాజాగా, ‘టైగర్ జిందా హై’ చిత్రంలో సల్మాన్ సరసన ఈ బ్యూటీ నటిస్తోంది.
 



  • Loading...

More Telugu News