: డ్రగ్స్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు: సినీ నటుడు తరుణ్
డ్రగ్స్ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి పేర్లు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో సినీనటుడు తరుణ్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో తరుణ్ స్పందిస్తూ, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. అయితే, అధికారుల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటులకు నోటీసులు వచ్చినంత మాత్రాన వాళ్లు తప్పు చేసినట్లు కాదని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పేర్కొంది. విచారణకు పిలవడం వేరు, నేరం చేయడం వేరని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొంది. అధికారికంగా పేర్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలని, అంతవరకూ, సినీనటుల పేర్ల విషయంలో మీడియా సంయమనం పాటించాలని ‘మా’ కోరింది.