: శశికళ వీఐపీ ట్రీట్‌మెంట్ వివాదం: `నన్ను మాత్రమే టార్గెట్ చేయడం అమానుషం`: జైళ్ల డీఐజీ రూప
అన్నాడీఎంకే నాయకురాలు శశికళను జైల్లో వీఐపీగా చూస్తున్నారని, అందుకు ఆమె లంచం ఇచ్చారని బట్టబయలు చేసిన కర్ణాటక జైళ్ల డీఐజీ రూప చిక్కుల్లో పడ్డారు. ఈ విషయం గురించి ముందు తన పైఅధికారులకు కాకుండా మీడియాకు చెప్పి నియమాలు ఉల్లంఘించారని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు చూపించాలని, లేకుంటే చర్య తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం పంపిన నోటీసుపై ఆమె స్పందించారు.
`నేను ఎలాంటి నియమాలు ఉల్లంఘించలేదు. నోటీసు నాకు మాత్రమే పంపించి, నన్ను మాత్రం టార్గెట్ చేయడం అమానుషం. నాకు నేనుగా ముందు మీడియా దగ్గరకు వెళ్లలేదు` అని ఆమె అన్నారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని రూప చెప్పారు.