: కంప్యూటర్ డేటా మొత్తాన్ని బ్యాకప్ చేసుకునే సౌకర్యం కల్పించిన గూగుల్
ఇప్పుడు కంప్యూటర్లో డేటాను బ్యాకప్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్ గానీ, పెన్‌డ్రైవ్ గానీ కొనక్కరలేదు. జస్ట్... ఆన్‌లైన్‌కి కనెక్టయ్యి గూగుల్ వారి బ్యాకప్ అండ్ సింక్ యాప్ ద్వారా గూగుల్ డ్రైవ్‌లో నిక్షిప్తం చేస్తే సరిపోతుంది. ఈ యాప్‌ను విండోస్, మ్యాక్ కంప్యూటర్లలో డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ కల్పించింది. కాకపోతే ప్రస్తుతానికి ఈ యాప్‌ను పర్సనల్ కంప్యూటర్లలోనే వాడాలని, వ్యాపార నిమిత్తం ఉపయోగించవద్దని గూగుల్ తెలిపింది. వ్యాపారావసరాల కోసం త్వరలోనే `డ్రైవ్ ఫైల్ స్ట్రీమ్` పేరుతో మరో బ్యాకప్ యాప్‌ను అందుబాటులోకి తెస్తామని గూగుల్ ప్రకటించింది.