: టాప్ 2000 పవర్‌ఫుల్ కంపెనీల్లో 50 భారత్‌లోనే! : ఫోర్బ్స్
ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితా ప్రకారం ప్రపంచంలో 2 వేల శక్తిమంతమైన పెద్ద కంపెనీల్లో 50 కంపెనీలు భారత్‌కు చెందినవే. కాకపోతే టాప్ 100 కంపెనీల్లో ఒక్క భారత కంపెనీ కూడా లేదు. ఈ 50 కంపెనీల్లో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ పారిశ్రామిక రంగంపై చైనా, అమెరికా కంపెనీల ఆధిపత్య స్థాయి ఈ జాబితా ద్వారా ప్రస్ఫుటమౌతోంది.
టాప్ 2000 కంపెనీల్లో చైనాకు చెందిన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకులు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. `టాప్ 500లో 12 శాతం కంపెనీలు చైనా - హాంగ్‌కాంగ్ దేశాలకు చెందినవే. 2003లో ప్రచురించిన జాబితాతో పోలిస్తే చైనా కంపెనీల సంఖ్య 10 శాతం పెరిగింది` అని ఫోర్బ్స్ తెలిపింది. భారత కంపెనీల విషయానికొస్తే - రిలయన్స్‌కి 106వ ర్యాంకు, ఎస్‌బీఐకి 244వ ర్యాంకు వచ్చాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ 258, ఇండియన్ ఆయిల్ 264, టాటా మోటార్స్ 290 స్థానాల్లో ఉన్నాయి.