: మీడియాలో రూమర్లు వద్దు: సీనియర్ నటుడు నరేష్


టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం అలజడి సృష్టిస్తోంది. ఈ కేసులో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని నోటీసులు అందుకున్న అంద‌రు న‌టులూ అంటున్నారు. ఈ వ్య‌వ‌హారంపై ఇతర టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందిస్తూ త‌మ అభిప్రాయం చెబుతున్నారు. కొంద‌రు చేసిన ప‌నికి సినీ ప‌రిశ్ర‌మ మొత్తాన్ని నిందించ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు. డ్ర‌గ్స్ కేసుపై సీనియర్ నటుడు నరేష్ స్పందిస్తూ... డ్ర‌గ్స్ ఎవ‌రు తీసుకున్నా తాము ఆ చ‌ర్య‌ను ఖండిస్తామ‌ని అన్నారు. తాము చ‌ట్టాన్ని గౌర‌విస్తామ‌ని, అయితే, మీడియాలో రూమ‌ర్లను మాత్రం ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌ని కోరారు. ఈ కేసులో అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు సంయ‌మ‌నం పాటించాల‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.     

  • Loading...

More Telugu News