: విజయ్ మాల్యా హాజరు కావాల్సిందే: సుప్రీంకోర్టు
భారత బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కేసు విచారణలో భాగంగా కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అతన్ని భారత్ తీసుకురావడానికి లండన్‌లో వేసిన కేసు వాయిదా పడ్డ విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ వరకు ఈ కేసు విచారణ కొనసాగబోదని తెలిపింది. సాక్ష్యాధారాల పరిమాణం పెద్దగా ఉండటం వల్ల వాటిని కుదించమని చెబుతూ లండన్ కోర్టు విజయ్ మాల్యా కేసును డిసెంబర్ వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అలాగే జీ20 సమావేశాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో విజయ్ మాల్యా విషయం గురించి చర్చించినట్లు సమాచారం.