: నోటీసులు అందని నటుల పేర్లను దయచేసి టీవీల్లో వేయకండి: శివాజీరాజా
టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే కొందరి పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారికి ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు పంపించగా మరికొందరికి ఈ రోజు సాయంత్రం నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై స్పష్టత లేదని అన్నారు. నోటీసులు అందుకున్న వారి పేర్లను మాత్రమే టీవీల్లో వేయాలని ఆయన కోరారు. తనీష్‌కు నోటీసులు అందలేదని ఆయన చెప్పారు. నోటీసులు అందని వారి పేర్లను దయచేసి వేయకూడదని కోరారు. తనీష్ ఇటీవలే తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నాడని చెప్పారు.