: ఈ న్యూస్ షాకింగ్ గా ఉంది: శ్యామ్ కే నాయుడు
డ్రగ్స్ కేసులో తన పేరు మీడియాలో వస్తుండటం తనకు షాకింగ్ గా ఉందని కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు అన్నారు. తాను ఎక్కువగా బయట కూడా కనిపించనని... డ్రగ్స్ అలవాటు తనకు లేదని చెప్పారు. ఇలాంటి ప్రచారంతో తన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎక్షైజ్ శాఖ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. మరోవైపు, నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులంతా కూడా తమకు డ్రగ్స్ అలవాటు లేదనే చెబుతున్నారు.